IPL Cricketer Hebbar: రెండేళ్లలో టీమిండియాకి సెలక్ట్ అవుతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టులో ఒక్కసారైనా ఆడాలని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడే ప్రతీ ఒక్కరి కల. అయితే ఆ అదృష్టం అందరికి దక్కదు. చాలా తక్కువమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అయితే కేవలం రెండేళ్లలో తాను భారత జట్టుకు ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు IPL క్రికెటర్ అశ్విన్ హెబ్బార్. ఇందులో భాగంగానే త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ లకు ప్రిపేర్ అవుతున్నానని చెబుతున్నాడు ఈ IPL క్రికెటర్. IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం వహించిన హెబ్బార్, రెండేళ్లలో టీమిండియాకి సెలక్ట్ కావడం తన లక్ష్యం అని చెబుతున్నాడు. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవని, ప్రతి ఒక్కరూ కష్టపడి తమ తమ రంగాల్లో రాణించాలని చెబుతున్నాడు. తాను కూడా నెల్లూరు ఏసీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ, చిన్నప్పటి నుంచి క్రికెట్ నే ధ్యాసగా పెట్టుకున్నానని, అందుకే సక్సెస్ కాగలిగానని అంటున్నాడు.
ఈ ఏడాది IPL లో ఏపీ నుంచి కేవలం ఇద్దరే ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఒకరు శ్రీకర్ భరత్ కాగా, ఇంకొకరు అశ్విన్ హెబ్బార్. IPL హడావిడి ముగిసిపోయిన తర్వాత నెల్లూరు కుర్రాడు అశ్విన్ హెబ్బార్ తన సొంత ఊరికి వచ్చాడు. స్థానిక క్రికెట్ క్రీడాకారులు, ఆయనను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాను చిన్నప్పుడు ఆడిన గ్రౌండ్ ని ఓసారి సందర్శించారు అశ్విన్ హెబ్బార్. IPL అనేది ఓ అద్భుత అవకాశమని, యువ క్రికెకటర్లకు ఇదో ఓ అద్భుత ప్లాట్ ఫామ్ అని అంటున్నారు అశ్విన్.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో తాను చూపిన ప్రతిభ తనను IPLకి ఎంపిక చేసిందని చెబుతున్నారు అశ్విన్ హెబ్బార్. ఈ టోర్నమెంట్ లో సెంచరీ కూడా సాధించాడు అశ్విన్. ఇక IPL లోని 8 ఫ్రాంచైజీల దగ్గరకు తాను ట్రయల్స్ కి వెళ్లానని, చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి సెలక్ట్ అయ్యాయనని అంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ సీజన్ ట్రైనింగ్ కి సిద్ధమవుతున్నట్టు చెప్పారు ఈ యంగ్ ప్లేయర్.
ఇకపోతే 1995 నవంబర్ 15న నెల్లూరులో జన్మించాడు అశ్విన్ హెబ్బార్. తండ్రి రాజ్ గిరి హెబ్బార్, తల్లి నళిని హెబ్బార్. వీరిద్దరూ అశ్విన్ ప్రతిభను చిన్న తనంలోనే గుర్తించి అతడికి క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. అశ్విన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ కూడా. కానీ బ్యాట్స్ మన్ గానే అశ్విన్ తన సత్తా చాటాడు. 2015లో త్రిపుర వర్సెస్ ఆంధ్రా టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అశ్విన్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చెలరేగిపోయాడు. బ్యాట్స్ మన్ గా సత్తా చూపుతూనే బౌలర్ గా కూడా రాణిస్తున్నాడు అశ్విన్. 2007లో అండర్ -13 జిల్లా జట్టుకి ఎంపికైన అశ్విన్.. 2022 నాటికి ఐపీఎల్ కి ఎదిగాడు. మరో రెండేళ్లలో టీమిండియాకు ఆడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవని చెప్పే అశ్విన్.. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఉత్తరాది నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉందని, దాన్ని దాటుకుని వెళ్లాలంటే ఏపీ ప్లేయర్స్ మరింత కష్టపడాలని చెబుతున్నాడు. మొత్తానికైతే నెల్లూరులోని యువ క్రికెట్ ప్లేయర్స్ కి అశ్విన్ ఆదర్శంగా నిలిచాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?