Site icon NTV Telugu

Cameron Green IPL Price: కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!

Cameron Green Ipl Price

Cameron Green Ipl Price

అందరూ ఊహించిందే నిజమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు నెలకొల్పాడు. గ్రీన్‌ బేస్‌ ప్రైస్‌ రూ.2 కోట్లు కాగా.. అతడి కోసం కేకేఆర్ సహా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

సెట్‌ 1 బ్యాటర్లలో కామెరూన్‌ గ్రీన్‌ వేలానికి రాగా.. ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ముంబైతో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడింది. రూ.2.80 కోట్ల వద్ద కోల్‌కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో ముంబై వేలం నుంచి తప్పుకుంది. గ్రీన్‌ కోసం రాజస్థాన్, కోల్‌కతాలు పోటీపడ్డాయి. రూ.13.60 కోట్ల వద్ద రాజస్థాన్ వెనక్కి తగ్గగా.. చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి వచ్చింది. చెన్నై, కోల్‌కతాలు నువ్వా నేనా అన్నట్లు గ్రీన్‌ కోసం పోటీపడ్డాయి. దాంతో గ్రీన్‌ ధర రూ.25.20కి పెరిగింది. చివరకు చెన్నై తప్పుకోవడంతో గ్రీన్‌ కోల్‌కతాకు సొంతమయ్యాడు.

Also Read: Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!

ఐపీఎల్ 2026లో ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కేకేఆర్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ చరిత్ర సృష్టించాడు. అంతకుందు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ అత్యధిక ధర పలికిన విషయం తెలిసిందే. 2024లో స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. 2024 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కమ్మిన్స్ను కొనుగోలు చేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషభ్‌ పంత్ (రూ.27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) గ్రీన్ కంటే ముందున్నారు.

Exit mobile version