Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma to Return as MI Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. భారత స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడంటూ మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. ముంబై ఇండియన్స్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2027 ఐపీఎల్ సీజన్లో రోహిత్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడనే ఊహాగానాలకు ఈ పోస్ట్ మరింత ఆజ్యం పోసింది.
ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆటగాళ్లను ప్రత్యేక పేర్లతో ప్రస్తావిస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో రోహిత్ శర్మను ‘కింగ్’గా పేర్కొనగా.. జస్ప్రీత్ బుమ్రాను ‘లయన్’గా, ట్రెంట్ బౌల్ట్‌ను ‘లైట్నింగ్’గా, తిలక్ వర్మను ‘స్టార్’గా అభివర్ణించింది. ఈ పోస్టులో రోహిత్‌కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూసిన అభిమానులు.. అతడు మళ్లీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడనే సంకేతంగా భావిస్తున్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2027 సీజన్లో జట్టు నాయకత్వంపై ముంబై యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
2026 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో నిలవడంతో జట్టు నాయకత్వంపై చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు సీజన్లలో రెండుసార్లు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 2024లో జట్టు చివరి స్థానంలో నిలవగా, 2023లో రెండో క్వాలిఫయర్ వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్ అవుతాడు అని కొన్ని రోజులుగా న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే హార్దిక్‌నే సారథిగా కొనసాగిస్తారా? లేదా రోహిత్ కెప్టెన్ అవుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 2013 నుంచి 2023 వరకు బాధ్యతలు నిర్వహించాడు. అతడి నాయకత్వంలో 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ముంబై ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. ఐదు టైటిళ్లతో రోహిత్ ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన ఎంఎస్ ధోనీతో కలిసి అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన కెప్టెన్లలో రోహిత్ కూడా ఉన్నాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై నిలకడైన విజయాలు సాధించడంతో పాటు ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే అతడు మళ్లీ కెప్టెన్‌గా వస్తాడనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
భారత జట్టుకు కెప్టెన్‌గా 2021 నుంచి 2025 వరకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2023 వన్డే ప్రపంచ కప్‌లోనూ రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్లోనూ, ఐపీఎల్‌లోనూ రోహిత్ సాధించిన విజయాలు అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఎంఎస్ ధోనీతో పాటు పలు ఐసీసీ ట్రోఫీలను అందుకున్న భారత కెప్టెన్లలో రోహిత్ ఒకడిగా నిలిచాడు.
Paltan, keep adding to the list in the replies 😉👇 https://t.co/GKbR2cmEZ2
— Mumbai Indians (@mipaltan) October 13, 2026
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!