IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harshal Patel IPL 2027 Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్న భారత పేసర్ హర్షల్ పటేల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) నుంచి గుజరాత్ టైటాన్స్ (జీటీ)లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా అతడిని రూ.4 కోట్లకు తీసుకునేందుకు జీటీ ఫ్రాంచైజీ అంగీకరించినట్లు ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది. 2025 మెగా వేలంలో హర్షల్ కోసం ఎస్ఆర్హెచ్ రూ.8 కోట్లు చెల్లించింది. ఇప్పుడు సగం ధరకు అతడిని జీటీ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే గుజరాత్ వేలం పర్స్ నుంచి రూ.4 కోట్లు తగ్గనున్నాయి.
ఐదో ఐపీఎల్ ఫ్రాంచైజీగా గుజరాత్:
ఈ ట్రేడ్ ఖరారైతే హర్షల్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్లో ఐదో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు మారే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ తరఫున హర్షల్ తన తొలి సీజన్లో మంచి ప్రదర్శన చేశాడు. 2025లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎకానమీ రేటు 9.80గా నమోదైంది. దాంతో 2026 సీజన్లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దిగిన హర్షల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్‌కు 10.82 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్లో అన్క్యాప్డ్ భారత పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌లకు సన్‌రైజర్స్ ఎక్కువ అవకాశాలు కల్పించింది.
Also Read
- IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
- Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత:
హర్షల్ పటేల్ ఐపీఎల్ కెరీర్లో 2021, 2024 సీజన్లు ప్రత్యేకంగా నిలిచాయి. 2021లో ఆర్సీబీ తరఫున 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున 24 వికెట్లు పడగొట్టి మరోసారి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన హర్షల్ల్కు ఈ మార్పు ఒకరకంగా సొంత ప్రాంతానికి తిరిగి వచ్చినట్లే. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు కొన్నేళ్ల క్రితమే గుజరాత్‌కు మారాడు. గుజరాత్ టైటాన్స్ పేస్ విభాగంలో కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. హర్షల్ చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది.
ఇదే మొదటిసారి కాదు:
హర్షల్‌పై గుజరాత్ ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. 2024 వేలంలో అతడి కోసం రూ.10.5 కోట్ల వరకు బిడ్ వేసింది. అయితే పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. 2025 మెగా వేలంలోనూ గుజరాత్ హర్షల్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నించి.. బిడ్డింగ్ రూ.6.5 కోట్లకు చేరిన తర్వాత వెనక్కి తగ్గింది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల బదిలీలపై దృష్టి పెట్టాయి. సన్‌రైజర్స్ కూడా ట్రేడింగ్‌లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఢిల్లీ నుంచి లెఫ్టార్మ్ పేసర్ టి. నటరాజన్‌ను తీసుకున్న ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో నాలుగు ఆటగాళ్ల ట్రేడ్‌లో భాగంగా ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను కూడా జట్టులోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!