IPL 2026-SRH Schedule: ఆర్‌సీబీతో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
- ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్
- మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Schedule for IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత.. ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించనుంది. ఇక 19వ ఎడిషన్ తొలి దశ మార్చి 28న ఆరంభమై.. ఏప్రిల్ 12 వరకు కొనసాగనుంది.
ఐపీఎల్ 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి దశలో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. సన్‌రైజర్స్ రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
మూడో మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 11న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈసారి టైటిల్ కొట్టాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్:
మార్చి 28 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు – రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 2 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – కోల్‌కతా – రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 5 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ – హైదరాబాద్ – మధ్యాహ్నం 3:30 గంటలకు
ఏప్రిల్ 11 – పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – ముల్లన్‌పూర్ – మధ్యాహ్నం 3:30 గంటలకు
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?