RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు
- 202 లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన ఆర్సీబీ
- కోహ్లీ అజేయ అర్ధశతకం.. పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్
- కిషన్ సూపర్ బ్యాటింగ్ వృథా.. హైదరాబాద్ ఓటమి
- డెబ్యూ బౌలర్ డఫీ మెరుపులు.. అయినా ఫలితం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 తొలి రాత్రి అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా, కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ (31) తోడవడంతో నాలుగో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటింది. ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ జాకబ్ డఫీ (3/22) అద్భుతంగా రాణించగా, షెపర్డ్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు.
Also Read
- Shubman Gill: "మా ప్లాన్ వర్కవుట్ అయింది".. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Pat Cummins: "ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా".. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. అయితే, వన్ డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (69 నాటౌట్; 38 బంతుల్లో) ఎంతో సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
పడిక్కల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31) రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వరుస బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. 16వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఒక సిక్స్, వరుసగా మూడు ఫోర్లు బాది కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 64వ అర్ధశతకం కావడం విశేషం.
తాజావార్తలు
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!