ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా మొదట మన ఇండియాలో ప్రారంభమై తర్వాత యూఏఈ వేదికగా ముగిసింది. అయితే ఈ లీగ్ లో కేవలం 8 జట్లు మాత్రమే పాల్గొనగా వచ్చే ఐపీఎల్ 2022 లో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అందుకోసం బీసీసీఐ ఇప్పటికే వేలం నిర్వహించి ఆ రెండు జట్లను ప్రకటించింది. ఈ ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్‌నర్స్ అహ్మదాబాద్ టీం, ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో జట్లను కొనుగోలు చేసాయి. అయితే ఈ ఇప్పుడు అందరూ ఏ ఐపీఎల్ వేలం కోసం చుస్తునారు. ఇక పాత జట్లు నలుగురి ఆటగాళ్లను ఈ వేలం నుండి రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్ లేదా ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిటెన్షన్ పాలసీ కోసం డిసెంబర్ 3వ తేదీని డెడ్‌లైన్‌గా బీసీసీఐ నిర్ధారించింది అని తెలుస్తుంది. అయితే ఈ డెడ్‌లైన్ లోగా కొత్తగా వచ్చిన రెండు జట్లు కూడా ప్లేయర్ రిటెన్షన్ కింద ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.