నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆటగాళ్ల ఆది నుంచి తడబడినట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుమీదున్న ఆర్సీబీ ఆటగాళ్లు కేకేఆర్‌కు చుక్కలు చూపించారు.
దీంతో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. సామ్ బిల్లింగ్స్ 13, ఆండ్రీ రసెల్ 4 పరుగులతో ఆడుతున్నారు. సామ్ బిల్లింగ్స్(14) రూపంలో కేకేఆర్ 87 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో ఆ జట్టు వంద పరుగులైనా దాటుతుందా అనేది అనుమానంగా మారింది. రసెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.