Site icon NTV Telugu

Seetharamapuram to Paris Olympics: ఒలింపిక్స్‌కు ఏపీ ఉత్పత్తులు.. ప.గో.. టు పారిస్..

Seetharamapuram

Seetharamapuram

Seetharamapuram to Paris Olympics: ఒలింపిక్‌కు ఆంధ్రప్రదేశ్‌ లో ఉత్పత్తి చేసిన వస్తువులు వెళ్తున్నాయి.. పారిస్ లో జరిగే ఒలింపిక్‌ క్రీడల్లో పశ్చిమగోదావరి జిల్లా సీతారామపురం పేరు వినపడబోతోంది. ఈ గ్రామంలో తయారైన లేసు ఉత్పత్తులను పారిస్ క్రీడాకారులకు అందించే ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఒలింపిక్‌ లోగోతో సీతారామపురంలో తయారైన టవల్స్, కుషన్లు, న్యాప్కిన్లు వంటి ఉత్పత్తులను అంతర్జాతీయ క్రీడాకారులకు ఒలింపిక్‌ నిర్వాహకులు అందించబోతున్నారు. బెస్ట్ క్వాలిటీ.. మంచి మన్నిక ఉండే సీతారామపురం లేసు ఉత్పత్తులు ప్యారిస్ లో జరిగే ప్రపంచ క్రీడా సంబరానికి చేరుకోవడంతో తయారీదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Fat Loss: బరువు తగ్గాలను కుంటున్నారా? ఈ నియమాలు పాటించండి..

కాగా, ఒలింపిక్ క్రీడలు 2024 జులై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగాల్సి ఉంది. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా, ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి. ఇక, పశ్చిమగోదావరి జిల్లా సీతారామపురం నుంచి ఒలింపిక్‌ క్రీడలకు వెళ్తున్న ఆ ఉత్పత్తుల పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version