టెస్టుల్లో 3వేల పరుగులు పూర్తి చేసిన హిట్‌మ్యాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్‌మ్యాన్…జూలు విదిల్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాల్గో టెస్టులో…సెంచరీతో చెలరేగాడు. అతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఓవరాల్‌గా…8వ సెంచరీ నమోదు చేయడంతో…భార్య రితిక సంబరాల్లో మునిగిపోయారు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ…నాల్గో టెస్టులో చెలరేగి ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హిట్‌మ్యాన్…సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై తొలి శతకం సాధించాడు. సిక్సర్‌తో వంద పరుగులు చేసిన రోహిత్ శర్మ…టెస్టుల్లో ఓవరాల్‌గా 8వ సెంచరీని పూర్తి చేశాడు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే… హిట్‌మ్యాన్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెషన్‌లో రాహుల్ ఔటైనా.. పుజారాతో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ సాధించాడు. అంతేకాదు…టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.
మొయిన్ అలీ వేసిన 63.5 ఓవర్‌కు బంతిని సిక్సర్‌గా మలిచి ఈ రెండు రికార్డులు నమోదు చేశాడు. పుజారాతో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 256 బంతుల్లో 127 పరుగులు చేసిన హిట్‌మ్యాన్…రాబిన్సన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
మరోవైపు హిట్‌మ్యాన్ సెంచరీ పూర్తి చేయగానే టీమ్‌ఇండియా బాల్కానీ చప్పట్లతో మార్మోగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ సతీమణి రితిక సంతోషంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!