FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫుట్‌బాల్ అభిమానులకు షాక్ ఇస్తూ ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను FIFA భారీగా పెంచింది.. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా “ఫ్రంట్ కేటగిరీ” పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే యూఎస్ ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ఫ్రంట్ కేటగిరీ 1 టికెట్ ధర $4,105గా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు (అంచనా) అవుతుంది. గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర $2,735 (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.
Read Also: Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం
Also Read
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన “ఫ్రంట్ కేటగిరీ 2” టిక్కెట్ల ధరలు $1,940 నుంచి $2,330 వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రపంచ కప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లోని 16 నగరాల్లో జరుగనుంది. కెనడా ఆరంభ మ్యాచ్‌కు కూడా ఫ్రంట్ కేటగిరీ 1 టిక్కెట్ల ధర $3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లకు కూడా ధరలు తక్కువగా లేవు. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్‌కు టికెట్ ధర $905 (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర $10,990గా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్లో ఇదే టికెట్ ధర $8,680 (సుమారు రూ.7.2 లక్షలు)గా ఉండేది. అదేవిధంగా, కేటగిరీ 2 టిక్కెట్లు $5,575 నుంచి $7,380 (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టిక్కెట్లు $4,185 నుంచి $5,785 (రూ.3.5 లక్షలు – రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద, ఈసారి ప్రపంచ కప్ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రీమియం అనుభవం పేరుతో ఫీఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?