Ben Stokes Returns: ‘క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes Returns: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి పోటీ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. జూలై 21న డర్హామ్ జట్టు తరఫున డెర్బీషైర్‌తో జరిగే వన్డే కప్ మ్యాచ్‌లో స్టోక్స్ బరిలోకి దిగనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కానుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన స్టోక్స్, తన చిన్ననాటి క్లబ్ డర్హామ్కు మళ్లీ ప్రాతినిధ్యం వహించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. క్రికెట్‌పై తనకు మళ్లీ ఆసక్తి పెరిగిందని, అయితే ఇంగ్లండ్ తరఫున మళ్లీ ఆడాలనే భావన మాత్రం తిరిగి రాలేదని వెల్లడించాడు. డర్హామ్కు తిరిగి రావడం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నాడు.
ఈ సీజన్లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం చోటుచేసుకున్న ఘటనల కారణంగా రెండో టెస్టుకు దూరమైన సమయంలో కూడా స్టోక్స్ డర్హామ్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడి, క్రికెట్‌తో మళ్లీ అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఇక, ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నమెంట్‌కు స్టోక్స్ దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. వేలంలో తన పేరును నమోదు చేయకుండా దేశవాళీ వన్డే, కౌంటీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే భవిష్యత్తులో విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడే అవకాశాలను మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేదు.
Also Read
- Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
- Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
డర్హామ్ తరఫున వన్డే కప్‌తో పాటు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనూ స్టోక్స్ ఆడే అవకాశముంది. ఈ క్రమంలో చిన్న మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లోనూ అభిమానులు అతని ఆటను ఆస్వాదించే అవకాశం దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత స్టోక్స్ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!