Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గాయంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన షమీని కాకుండా జమ్మూ కశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీని ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమీకి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మహ్మద్ షమీ చివరిసారిగా 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్లో అయితే 2023 తర్వాత ఆయనకు అవకాశం రాలేదు. గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనే చివరిసారిగా భారత జెర్సీ ధరించాడు.
షమీని తొలుత గాయాలు ఇబ్బంది పెట్టినా, గత ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఇటీవల ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 1,383 బంతులు వేసి 37 వికెట్లు పడగొట్టాడు. 16.72 సగటుతో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించడంతో పాటు 8/90 కెరీర్ బెస్ట్ ఫస్ట్‌క్లాస్ గణాంకాలు నమోదు చేశాడు. అయితే అదే రంజీ సీజన్లో అకీబ్ నబీ 60 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 12.56 సగటుతో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి శ్రీలంక టెస్టు సిరీస్‌కు అవకాశం దక్కింది.
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఇటీవల షమీ పునరాగమనంపై స్పందించిన అజిత్ అగార్కర్, టెస్టు క్రికెట్ ఆడేందుకు అవసరమైన పూర్తి ఫిట్నెస్ ప్రస్తుతం షమీ వద్ద లేదని పేర్కొన్నారు. దీంతో సెలెక్టర్లు ఇప్పుడు కేవలం అనుభవం కంటే ఫిట్నెస్, దేశవాళీ ప్రదర్శనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం స్పష్టమైంది. భవిష్యత్తులో టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే షమీ దులీప్ ట్రోఫీ వంటి టోర్నీల్లో నిలకడగా రాణించడంతో పాటు పూర్తి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం యువ పేసర్లు కేవలం జట్టులో చోటు కోసం కాకుండా తుది జట్టులో స్థానం కోసం కూడా తీవ్ర పోటీ ఇస్తుండటంతో షమీకి పునరాగమనం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!