Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International Sports Indian Captain Rohit Sharma Very Upset With Broadcaster Star Sports

Rohit Sharma: ‘వాస్తవాలు చూపించండి’.. బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ అసహనం

Published Date :January 25, 2023 , 10:55 am
By Nishanth Munjala
Rohit Sharma: ‘వాస్తవాలు చూపించండి’.. బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ అసహనం

టీమిండియా అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాస్తవాలను చూపించాలని మండిపడ్డాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (85 బంతుల్లో 101) సెంచరీతో అదరగొట్టాడు. మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శతకాన్ని అందుకున్నాడు. 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి సారిగా సెంచరీ బాదిన హిట్‌మ్యాన్.. ఇన్నాళ్లకు మరో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ పదే పదే చూపించింది. అయితే తన వన్డే సెంచరీకి మూడేళ్లు పట్టిందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ ప్రచారం చేయడాన్ని రోహిత్ శర్మ తప్పుబట్టాడు. ఈ మూడేళ్లలో తాను ఆడింది 12 వన్డేలు మాత్రమే అనే విషయాన్ని ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు.

Virat Kohli: కోహ్లీ కంటే నేనే బెటర్: పాక్ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్

న్యూజిలాండ్‌తో మూడో వన్డే అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. ఈ సమయంలో సెంచరీ చేయడానికి మూడేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందని ఓ జర్నలిస్ట్ హిట్‌మ్యాన్‌ను అడిగాడు. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ స్టార్ స్పోర్ట్స్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూడేళ్ల కాలంలో తాను 12 వన్డేలు మాత్రమే ఆడాననే విషయాన్ని అందరు గుర్తించాలని కోరాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ చూపించకపోవడంపై మండిపడ్డాడు. “ఈ మూడేళ్లలో నాకు ఇది తొలి సెంచరీ. ఈ సమయంలో నేను ఆడింది 12 వన్డేలు మాత్రమే. మూడేళ్లు అనేది చాలా ఎక్కువ కాలంగా వినిపిస్తోంది. క్రికెట్ జర్నలిస్ట్‌లుగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి.మూడేళ్ల తర్వాత సెంచరీ అని బ్రాడ్‌‌కాస్టర్ చూపించిందనే విషయం తెలుసు. కానీ బ్రాడ్ కాస్టర్ వాస్తవాలు కూడా చూపించాలి. నిరుడు మేం వన్డే క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొవాలి. బ్రాడ్‌కాస్టర్ నిజాలను మాత్రమే చూపించాలి” అని హిట్‌మ్యాన్ గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగులతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా అందుకుంది రోహిత్‌సేన.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన జాబితాలో రోహిత్.. రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. 365 ఇన్నింగ్స్‌ల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు చేయగా.. రోహిత్ 234 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 49(452 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్ కోహ్లీ 46 (261 ఇన్నింగ్స్‌ల్లో) ముందున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.

ntv google news
  • Tags
  • Rohit Sharma INDvs NZ ODi
  • Rohit Sharma latest news
  • Rohit Sharma Star Sports
  • Rohit Sharma upset with BROADCASTER
  • Star Sports Rohit

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

Rohit Sharma: క్లీన్‌స్వీప్ కింగ్ రోహిత్..టీమిండియా కెప్టెన్‌గా దూకుడు

తాజావార్తలు

  • Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

  • AP Young Man Died in America: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన 3 రోజులకే విషాదం

  • Padma Shri: పాములు పట్టేవారిని వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం

  • Jamuna: జమున మెడ నరాల సమస్యలకు అసలు కారణం!?

  • Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions