NTV Telugu Site icon

IND vs AUS: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. సత్తా చాటిన స్పిన్నర్లు

India Won Match

India Won Match

India Won Second Test Match Against Australia In Delhi: ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ జట్టుపై భారత్ గెలుపొందింది. ప్రత్యర్థి జట్టు కుదిర్చిన 115 పరుగుల లక్ష్యాన్ని.. నాలుగు వికెట్ల నష్టానికి భారత్ ఛేదించింది. దీంతో.. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో మన భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ కలిసి అద్భుతంగా రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జడేజా తిప్పేయడంతో.. కంగారులు కకావికలం అయ్యారు. అతని ధాటికే ఆసీస్ జట్టు స్వల్ప స్కోరుతో చాపచుట్టేసింది. లక్ష్యంతో చిన్నదే కావడంతో.. భారత బ్యాటర్లు సునాసాయంగా చేధించేశారు.

Bihar: భయపడి సెల్‌ఫోన్ మింగేసిన ఖైదీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. 262 పరుగులకి కుప్పకూలింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ శుభారంభమే చేసింది. రెండో రోజు ఆటకు 62/1 పరుగులతో ముగించింది. మూడో రోజు ఆట ప్రారంభమయ్యాక కూడా ఆసీస్ జట్టు పటిష్టంగానే కనిపించింది. కానీ, ఆ తర్వాత జడేజా చేతిలో చిత్తుచిత్తు అయ్యింది. ట్రావిస్ హెడ్ (43), మార్నస్ (35) మినహాయిస్తే.. మిగతా ఆసీస్ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అందులో ముగ్గురు సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో జడేజా 7 వికెట్లతో చెలరేగిపోగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ..

ఇక 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదటినుంచి ఆచితూచి ఆడుతూ, లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహాలో పరుగుల వర్షం కురిపించాడు. దీంతో.. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లో సహాయంతో 31 పరుగులు చేశాడు. అయితే.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (1) ఎప్పట్లాగే నిరాశపరిచాడు. కోహ్లీ (20), శ్రేయస్ (12) కూడా పెద్దగా రాణించలేకపోయారు. శ్రీకర్‌తో కలిసి పుజారా జట్టుని లక్ష్యం దిశగా తీసుకెళ్లి, గెలిపించాడు.

RRR: మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్