IND Vs AUS: చెలరేగిన రో‘హిట్’.. లెక్క సమం చేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs AUS: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చెలరేగిపోయింది. 91 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ (10) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే చివరి ఓవర్‌లో స్ట్రైకింగ్‌కు వచ్చిన దినేష్ కార్తీక్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపాకు 3 వికెట్లు పడగా కమిన్స్ ఓ వికెట్ సాధించాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కీలకమైన మూడో టీ20 ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనుంది.
Read Also:IND Vs AUS: రెండో టీ20 8 ఓవర్లకు కుదింపు.. టాస్ గెలిచిన టీమిండియా
Also Read
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మైదానం చిత్తడిగా ఉండడంతో ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి దూకుడుగా ఆడాడు. వేడ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఫించ్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?