IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత్ ప్లేయింగ్ XIపై ఆసక్తికర అప్డేట్స్, ఆ ఇద్దరు ఇన్!
- జింబాబ్వేతో భారత్ కీలక పోరు
- భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు
- మూడో స్థానంలో సంజూ శాంసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing XI Updates vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో కీలక పోరుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తిరిగి జట్టులో స్థానం దక్కే అవకాశాలు దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జింబాబ్వేపై సంజూ మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో తిలక్ వరుసగా విఫలమవడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో తిలక్ వర్మ తన అత్యుత్తమ ప్రదర్శనను చేయలేదు. నెదర్లాండ్స్‌పై 27 బంతుల్లో 31 పరుగులే అతడి అత్యధిక స్కోరు. అమెరికాపై 25, నమీబియాపై 25, పాకిస్తాన్‌పై 25 రన్స్ చేశాడు. మంచి ప్రారంభాలను బిగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాపై 1 రన్ చేసి పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో 21.40 సగటుతో 107 పరుగులు చేశాడు. తిలక్ స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.
Also Read
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంపై కూడా సందేహలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సుందర్ స్థానంలో ఆడుతాడని తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి మద్దతుగా నిలుస్తున్నాడు. జింబాబ్వేపై మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జింబాబ్వేపై ఆడడం దాదాపుగా లాంఛనమే.
Also Read: Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!
జింబాబ్వేతో మ్యాచ్ చెన్నై వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ పోరు టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం గెలిస్తే సరిపోదు.. 150 పరుగుల తేడాతో గెలవాలి. అందుకే టీమ్ మేనేజ్మెంట్ సరైన కాంబినేషన్ కోసం చూస్తోంది. మరి కెప్టెన్ సూర్య ఎవరికి అవకాశం ఇస్తాడో. ఎవరు తుది జట్టులో ఉంటారో తెలియాలంటే టాస్ వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!