IND Vs WI: నేటి నుంచి రోహిత్ సారథ్యంలో ఐదు టీ20ల సిరీస్.. అశ్విన్ ఆడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో రిషబ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ వరుస స్థానాల్లో ఆడనున్నారు.
జడేజా ఫిట్‌గా ఉంటే అతడు బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ అతడు దూరమైతే అశ్విన్‌ను తుదిజట్టులో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అశ్విన్ ఉంటే అతడు తుది జట్టులోకి వస్తాడు లేదంటే దీపక్ హుడా లేదా అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం సంపాదించనున్నారు. పేస్ విభాగంలో భువనేశ్వర్, హర్షల్ పటేల్‌కు తోడుగా అవేష్ ఖాన్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరిని రోహిత్ ఎంచుకోవచ్చు. అయితే వన్డే సిరీస్‌లో తేలిపోయిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో పుంజుకునే అవకాశాలున్నాయి. పూరన్, పావెల్, హోల్డర్, కైల్ మేయర్స్, అల్జారి జోసెఫ్, హుస్సేన్‌లతో విండీస్ బలంగానే కనిపిస్తోంది. విండీస్ జట్టులో ఎక్కువగా హిట్టర్లే ఉండటంతో భారత బౌలర్లు వాళ్లకు కళ్లెం ఎలా వేస్తారో వేచి చూడాలి.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!