శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్
★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్
★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175
★ జడేజా ఖాతాలో 5 వేలకు పైగా పరుగులు, 400కు పైగా వికెట్లు
★ టెస్టుల్లో అశ్విన్ 12వ హాఫ్ సెంచరీ
★ టెస్టుల్లో వికెట్ల విషయంలో కపిల్ దేవ్‌ను దాటిన అశ్విన్ (436)
★ టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కోహ్లీ
★ సారథిగా తొలి టెస్టులో రోహిత్ విజయం.. తొలిటెస్టులోనే విజయం సాధించిన రెండో భారత కెప్టెన్ రోహిత్. 1955-56లో పాలీ ఉమ్రిగర్ టీమిండియా సారథిగా తొలి టెస్టులోనే న్యూజిలాండ్‌పై విజయం అందుకున్నాడు.
★ శ్రీలంకకు ఇండియాలో ఇది 21వ పరాజయం.. విదేశాల్లో ఆ జట్టుకు ఇండియాలోనే అత్యధిక పరాజయాలు నమోదయ్యాయి. పాకిస్థాన్ గడ్డపై 20 పరాజయాలను శ్రీలంక చవిచూసింది.
