IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Asia Cup 2026 U19 Final: 2026 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. శనివారం (నవంబర్ 14) ఒమన్‌లోని మస్కట్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లలో ఏ టీమ్ విజయం సాధించి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం మరోసారి టైటిల్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉంది.
అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు పాక్:
ఈ టోర్నీలో పాకిస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలోనే భారత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టు పాకిస్థానే కావడం విశేషం. మరోవైపు భారత జట్టు కూడా టైటిల్‌పై కన్నేసింది. గత ఎడిషన్‌లోనూ భారత్, పాకిస్థాన్ జట్లే ఫైనల్లో తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత యువ ఆటగాళ్లు భావిస్తున్నారు.
Also Read
- Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!
- IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
- Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
- IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్‌లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తప్పించారంటే?
సమిష్టి ప్రదర్శన చేయాల్సిందే:
భారత ఆటగాళ్లలో ఆర్యవీర్ సెహ్వాగ్, ఇషాన్ సూద్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టోర్నీలో ఆర్యవీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 101 సగటుతో 303 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ ఇషాన్ 11 వికెట్లతో చెలరేగాడు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని, వికెట్‌కీపర్ అన్వయ్ ద్రవిడ్, వీకే వినీత్, అర్జున్ రాజ్‌పుత్ బ్యాటుతో చెలరేగాల్సి ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న దాయాది జట్టును ఆడుకోవాలంటే.. మనోళ్లు సమిష్టిగా రాణించాల్సిందే.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?:
భారత్, పాకిస్థాన్ అండర్-19 జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ నేడు జరగనుంది. ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు.. 10 గంటలకు టాస్ వేయనున్నారు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?:
ఫైనల్ మ్యాచ్‌ను భారత క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టీవీ లేదా మొబైల్లో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అండర్-19 టీమ్ డీటెయిల్స్:
భారత్: లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, యశ్బర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ సావసాని, కావ్య పటేల్, ఇషాన్ సూద్, కుషాగ్ర ఓజా, రజత్ బగేల్, షావిన్ వినోద్, యశ్వీర్ గౌడ్.
పాకిస్థాన్: ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హంజా జహూర్ (వికెట్ కీపర్), హస్నైన్ అబ్బాస్ దార్, మహమ్మద్ సయ్యమ్, రిజ్వానుల్లా, నిఖాబ్ షఫీక్, జహంగీర్ బిలాల్, హుజైఫా అహ్సన్, మహమ్మద్ హుజైఫా, అబ్దుల్ సుబ్హాన్.
తాజావార్తలు
-
Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘అక్వాన్’..
-
Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!