NTV Telugu Site icon

Asia Cup 2022: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ సమరం.. ఎప్పుడంటే..?

Ind Vs Pak

Ind Vs Pak

Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, భువనేశ్వర్ బౌలింగ్, విరాట్ కోహ్లీ విలువైన పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆసియాకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మేరకు రెండు గ్రూపులుగా విడిపోయాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 జరుగుతుంది. అంటే గ్రూప్-ఎలో టాప్-2 జట్లు, గ్రూప్-బిలో టాప్-2 జట్లు సూపర్-4లో తలపడతాయి. సూపర్-4లో ప్రతి జట్టు ఇతర జట్టుతో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.

Read Also: Charmee Kaur: ‘లైగర్’ ప్లాప్ పై స్పందించిన ఛార్మీ .. పరిస్థితి దారుణంగా ఉందంటూ కన్నీరు

గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్ సూపర్-4కి చేరడం సులభమే అని తెలుస్తోంది. హాంకాంగ్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఇందులో ఎలాంటి మార్పు లేకపోవచ్చు. సెప్టెంబర్ 3 నుంచి సూపర్-4 పోటీలు జరగనుండగా సెప్టెంబర్ 4న ఆదివారం నాడు గ్రూప్-ఎలోని టాప్-2 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అంటే గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పాకిస్థాన్‌పై భారత్ గెలిచి గ్రూప్‌లో టాప్‌లో ఉంది. హాంకాంగ్‌ మీద కూడా గెలవడం కష్టమేమీ కాదు. అటు పాకిస్థాన్‌ సూపర్-4 చేరాలంటే హాంకాంగ్‌పై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ ప్లస్ 0.175 కాగా పాకిస్థాన్ నెట్ రన్ రేట్ మైనస్ 0.175గా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం మరోసారి హై ఓల్టేజీ మ్యాచ్‌ జరుగుతుందని భారత్, పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Show comments