NTV Telugu Site icon

T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!

T20 World Cup

T20 World Cup

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శనివారమే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. రెండో రోజే టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ గెలిచి.. పాక్‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన ఉవ్వళ్లూరుతోంది. అయితే అందరి కళ్లు ఇరు జట్ల ఆటగాళ్లపై కాకుండా వరుణుడిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా రద్దవుతుందా అన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లు ఆడాల్సి వచ్చినా.. లేదా 5 ఓవర్లు ఆడాల్సి వచ్చినా అన్ని రకాల పరిస్థితులకు తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వాతావరణానికి సంబంధించిన విషయాలు తమ చేతుల్లో ఉండవన్నాడు. అటు ఈ మ్యాచ్ జరగాలని తాము కోరుకుంటున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. మ్యాచ్‌ను ఎలా నిర్వహించినా ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కాగా ఎంసీజీలో జరగనున్న ఈ మ్యాచ్‌కు సుమారు లక్ష మంది ప్రేక్షకులు తరలిరానున్నారు.

జట్ల అంచనా:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/చాహల్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ
పాకిస్థాన్: బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫ్ అలీ, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షహీన్ అఫ్రిది