T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శనివారమే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. రెండో రోజే టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్వళ్లూరుతోంది. అయితే అందరి కళ్లు ఇరు జట్ల ఆటగాళ్లపై కాకుండా వరుణుడిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా రద్దవుతుందా అన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లు ఆడాల్సి వచ్చినా.. లేదా 5 ఓవర్లు ఆడాల్సి వచ్చినా అన్ని రకాల పరిస్థితులకు తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వాతావరణానికి సంబంధించిన విషయాలు తమ చేతుల్లో ఉండవన్నాడు. అటు ఈ మ్యాచ్ జరగాలని తాము కోరుకుంటున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. మ్యాచ్‌ను ఎలా నిర్వహించినా ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కాగా ఎంసీజీలో జరగనున్న ఈ మ్యాచ్‌కు సుమారు లక్ష మంది ప్రేక్షకులు తరలిరానున్నారు.
Also Read
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
- ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
జట్ల అంచనా:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/చాహల్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ
పాకిస్థాన్: బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫ్ అలీ, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షహీన్ అఫ్రిది
https://www.youtube.com/watch?v=Bhxo6Km-67I&feature=youtu.be&ab_channel=NTVSports
తాజావార్తలు
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
-
Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
-
Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!