NTV Telugu Site icon

Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా స్టార్ ప్లేయర్కు రెస్ట్..!

Ind Vs Nz

Ind Vs Nz

Ind vs NZ: ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతుంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి.. ఆ తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందనే ఉద్దేశంతో ఆతిథ్య టీమ్ ఈ డిసిషన్ తీసుకుంది. ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన రోహిత్ సేన.. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ విజయం భారత్ కు అత్యవసరం. కాగా, ఈ మ్యాచ్ లో స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో పేస్ విభాగాన్ని మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్‌ నడిపించనున్నారు. అలాగే, రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజాలను కొనసాగించింది. అయితే, తొలుత వీరికి కూడా విశ్రాంతినిచ్చి.. అక్షర్‌ పటేల్, ధ్రువ్‌ జురెల్‌ను తుది జట్టులో ఆడిస్తారని భావించారు. న్యూజిలాండ్‌ జట్టులోనూ రెండు మార్పులు చేశారు. టీమ్ సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్‌ స్థానంలో ఐష్‌ సోధికి ఛాన్స్ దక్కింది.

Read Also: Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. స్పిరిట్ మెుదలెట్టారు..

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్‌ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్.

న్యూజిలాండ్‌: టామ్‌ లేథమ్ (కెప్టెన్), కాన్వే, డారిల్ మిచెల్, విల్‌ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్‌ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్‌ ఒరోర్కీ.

Show comments