Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
- నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్..
- రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
- ఇంగ్లాండ్తో జరిగే సిరీస్పై కన్నేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్‌కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. రాజ్‌కోట్‌లోనూ అదే ఊపును కొనసాగించాలనే వ్యూహంతో బరిలోకి సూర్య సేన దిగబోతుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలోనూ ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. మూడో టీ20లో అయినా విజయం సాధించి సిరీస్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
Read Also: Laila : అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో రిలీజ్
Also Read
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Singapore Open 2026: సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
అయితే, భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సారథిగా జట్టుకు విజయాలను అందిస్తున్నప్పటికి.. వ్యక్తిగతంగా అతడి ఫామ్ మాత్రం బాగాలేదు. గత 17 ఇన్నింగ్స్‌లలో సూర్య.. 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్‌కోట్‌లో అయినా గత ఫామ్‌ను సూర్య అందుకోవాలని భారత్ యాజమాన్యం ఆశిస్తోంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ షార్ట్ బాల్స్‌కు పెవిలియన్ బాట పట్టాడు. రాజ్‌కోట్‌లో అతడు విజృంభిస్తే భారత్‌కు మంచి శుభారంభం దక్కుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్‌లో ఉండగా.. రింకూ సింగ్, నితీశ్ కుమార్ గాయాలతో మ్యాచ్ లకు దూరం కాగా, ఈ మూడో టీ20లో శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Road Accident: కొంప ముంచిన ఓవర్ స్పీడ్.. ముగ్గురు మైనర్ల దుర్మరణం
ఇక, టీమ్ నిండా స్టార్లు, హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మిగిలిన వారందరూ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్ లాంటి హిట్టర్లంతా భారత పిచ్ లపై తేలిపోతున్నారు. రాజ్‌కోట్‌లో ఆ జట్టు తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఇంగ్లీష్ జట్టు సిరీస్‌పై ఆశలు గల్లంతైనట్లే. ఆర్చర్, వుడ్, రషీద్ లాంటి బౌలర్లు భారత కుర్రాళ్లను అపలేకపోతున్నారు. అన్ని రంగాలలో బట్లర్ సేన ఇబ్బంది పడుతుంది. కాగా, రాజ్‌కోట్‌లో భారత్ ఆడిన ఐదు టీ20ల్లో నాలుగింటిలో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!