NTV Telugu Site icon

IND vs ENG: నేడే భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

Engvsind

Engvsind

IND vs ENG: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ పోటీ పడబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు (జనవరి 22) ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో మొదటి మ్యాచ్‌ జరగబోతుంది. అయితే, ఇరు జట్ల బలాబలాలను చూస్తే దాదాపు సమానంగా కనపడుతున్నాయి. ఇక, ఇంగ్లాండ్ జట్టు టీ20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్‌ తనదైన శైలిలో జట్టును రెడీ చేశాడు. అలాగే, మరోవైపు, గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ మహ్మద్ షమీపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టుకి కూడా ఎంపికైన అతడు టీ20 ఫార్మాట్‌ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు.

Read Also: JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!

అయితే, రెండు నెలల క్రితం టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన చేసి.. 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌ చివరి మ్యాచ్‌తో పోలిస్తే దాదాపు అదే జట్టు ఇప్పుడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన జోరును మరోసారి ప్రదర్శించాలని చూస్తున్నాడు. రెండో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ రాణించాల్సి ఉంది. అలాగే, వరుసగా రెండు అంతర్జాతీయ టీ20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌ వర్మ కూడా అదే ఉత్సాహంతో రెడీగా ఉండగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్‌ భారీ స్కోరును చేయగలరు. అయితే, తెలుగు క్రికెటర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక, ఈడెన్‌ గార్డెన్ స్టేడియం బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారీ స్కోర్లు చేయడం ఖాయం.. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్‌ తీసుకునే ఛాన్స్ ఉండగా.. వర్షం పడే అవకాశం లేదు.

Read Also: Greenland: ‘‘మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు’’.. ట్రంప్‌కి షాక్..

ఇరు జట్ల వివరాలు
భారత్‌ (అంచనా): సూర్య కుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, మహ్మద్ షమీ, ఆర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌/ వాషింగ్టన్ సుందర్‌.

ఇంగ్లండ్‌: జోస్ బట్లర్‌ (కెప్టెన్‌), ఫిల్ సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్‌సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్‌ వుడ్‌.