NTV Telugu Site icon

IND vs AUS: ఫైనల్ ఫైట్.. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

India Vs Aus

India Vs Aus

India vs Australia Lunch Break Innings: భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతుంది. ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి సెషన్ లో నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి.. 75 పరుగులు చేసింది.ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మార్నస్ లబుషేన్ విఫలమయ్యాడు. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా 94 బంతుల్లో 27 పరుగులు, ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ 17 బంతుల్లో 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, షమీ తలో వికెట్ సాధించారు.

DK Aruna: అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో..

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే పరుగులు సాధించడం మొదలు పెట్టారు. గత మూడు టెస్టులకు భిన్నంగా నాలుగో టెస్ట్ పిచ్ ఉంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫోర్లతో విరుచుకుపడ్డారు. అదే టైంలో ఇండియన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పలు క్యాచ్ లను నేలపాలు చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన ఆశ్విన్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేయడంతో భారత్ కు ఫస్ట్ బ్రేక్ ను ఇచ్చాడు. కాసేపటికే లబుషేన్ ను ఇండియన్ బౌలర్ మహ్మద్ షమీ అవుట్ చేశాడు. అనంతరం మరో వికెట్ పడకుండా ఆసీస్ టీం జాగ్రత్త పడ్డ స్మిత్, ఖవాజా లంచ్ బ్రేక్ కు వెళ్లారు.

Gujarat: అక్రమాలను గుర్తించాడని ఐఏఎస్ అధికారిని చితకబాదిన కాంట్రాక్టర్..

ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య స్నేహ బంధానికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ స్టేడియంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోడీ, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హజరయ్యారు. టాస్ కు ముందు ఇరు దేశాల కెప్టెన్లకు క్యాప్ లను భారత్-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు అందజేశారు. అనంతరం ఇరు ప్రధానులు ల్యాప్ ఆఫ్ ఆనర్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వీరిద్దరూ గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం తమ ప్లేయర్లను ఇరు దేశా కెప్టెన్లు ప్రధానులకు పరిచయం చేశారు.

Lifestyle : జీవితంలో ఇవి మార్చుకుంటే.. మీ కాన్ఫిడెంట్స్ లెవల్ పెరిగినట్లే

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్ ప్రారంభమైంది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఈ టెస్ట్ గెలిచిన మ్యాచ్ డ్రా అయిన సీరిస్ భారత్ కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిస్తే మాత్రం 2-2 తేడాతో సీరిస్ ముగుస్తుంది.