India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారత్ తన అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అద్భుత శతకాలతో రాణించగా, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకాలతో జట్టుకు కొండంత స్కోరును అందించారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. అరంగేట్రం చేసిన 23 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన స్పెల్‌తో ఆఫ్ఘన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి డెబ్యూ మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల మైలురాయిని దాటాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒంటరి పోరాటం చేస్తూ తన ఆరో టెస్టు అర్ధ శతకాన్ని (60 పరుగులు) నమోదు చేశాడు. శరఫుద్దీన్ అష్రఫ్తో కలిసి కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ, సుతార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక వికెట్ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ 58.4 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమై ఫాలోఆన్ లో పడింది.
Also Read
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ను భారత స్పిన్ ద్వయం వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కోలుకోలేని దెబ్బ కొట్టారు. వీరిద్దరూ కలిసి ఏడు వికెట్లు పడగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ముగింపులో ఆఫ్ఘనిస్తాన్ 9వ వికెట్ పడిన వెంటనే భారత్ విజయం సాధించినట్లు ప్రకటించడంతో కాస్త గందరగోళం నెలకొంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలి గాయంతో ఇబ్బంది పడిన శరఫుద్దీన్ అష్రఫ్ గాయం తీవ్రత కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోవడంతో భారత్ విజయం ఖరారైంది. ఈ రకమైన అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డును లిఖించింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!