Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతూ శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నాంగేయాలియా ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు.
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
అనంతరం 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు గుర్బాజ్ (41), ఇబ్రహీం జద్రాన్ (21) మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించినా ఆ తర్వాత వికెట్లు కోల్పోయారు. రహ్మత్ షా ఒక్కడే 79 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక సెదిఖుల్లా అటల్ 42 పరుగులు చేయగా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (4), రషీద్ ఖాన్ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, సుందర్, అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!