U19 World Cup Record: 92 శాతం విజయాలు.. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత్ డామినెన్స్!

  • అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత్ డామినెన్స్
  • వరల్డ్‌కప్‌లలో భారత్ ఆడిన మ్యాచ్‌లు 38
  • కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి
India U19 World Cup Record

India U19 World Cup Record

India U19 World Cup Record: 2016 నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌లలో భారత యువ జట్టు చూపిస్తున్న ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాలంలో భారత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, సాధించిన విజయాలు చూస్తే.. యువ క్రికెట్‌లో టీమిండియా ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. నిలకడ, లోతైన బ్యాటింగ్ లైనప్‌, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దళం భారత్‌ను ఇతర జట్ల కంటే ముందుకు తీసుకెళ్తోంది.

2016 నుంచి ఇప్పటివరకు జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లలో భారత్ మొత్తం 38 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏకంగా 35 మ్యాచ్‌లలో విజయం సాధించి.. అద్భుత రికార్డు నెలకొల్పింది. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిని చవిచూసింది. ఆ మూడు పరాజయాలు కూడా లీగ్ లేదా నాకౌట్ దశల్లో కాకుండా.. నేరుగా ఫైనల్ మ్యాచ్‌ల్లో ఉండడం గమనార్హం. 2016, 2020, 2024 అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్‌ ఓటమిని ఎదుర్కొంది. అయినప్పటికీ ఫైనల్ వరకు చేరుకోవడం, వరుసగా టైటిల్ పోరులో నిలవడం భారత యువ క్రికెట్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Also Read: Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్‌లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!

అండర్‌-19 వరల్డ్‌కప్‌లలో భారత్‌ విజయం శాతం 92.1 శాతంగా ఉంది. వరల్డ్‌కప్ చరిత్రలో ఇది గొప్ప రికార్డుల్లో ఒకటి. మొత్తంగా చూస్తే.. 2016 నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌లలో భారత్ యువ జట్టు ఆధిపత్యం అసాధారణం అనే చెప్పాలి. వరల్డ్‌కప్‌లలో ప్రతిసారి ఫైనల్స్ చేరడం, అధిక విజయ శాతం నమోదు చేయడం భారత క్రికెట్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం. ఈ యువ ఆటగాళ్లే రానున్న రోజుల్లో సీనియర్ టీమిండియాకు వెన్నెముకగా మారతారనే నమ్మకం క్రికెట్ అభిమానుల్లో బలంగా ఉంది.