India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్?.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే!
- సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా సూరీడు ఔట్
- టీమిండియా టీ20 కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్
- చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New T20 Captain is Shreyas Iyer: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూరీడు.. జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్‌గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా.. సూరీడి భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సూర్య ఫామ్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల అతడు పరుగుల చేసేందుకు ఇబ్బంది పడుతుండటం, ఐపీఎల్ 2026లో కూడా నిరాశపరిచే ప్రదర్శన చేయడం ఈ నిర్ణయానికి కారణం అని పేర్కొన్నాయి. ఐపీఎల్‌లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచే అయ్యర్‌కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
భారత జట్టులో కొత్త ఉత్సాహం తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నాడట. త్వరలోనే ‘సర్పంచ్ సాబ్’ టీమిండియా కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. జట్టుకు తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు అందించడంతో పాటు తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 333 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే అతడిని మరలా భారత జట్టులోకి తీసుకొస్తోంది. శ్రేయస్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో కనీసం బ్యాటర్‌గా అయినా చోటు దక్కించుకుంటాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో సూర్యకుమార్ కొంతకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఆ నొప్పితోనే మ్యాచ్‌లు ఆడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కెప్టెన్‌గా సూరీడి రికార్డు అద్భుతంగా ఉన్నా.. బ్యాటర్‌గా తేలిపోవడమే అతడిపై వేటుకు కారణం అవుతుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!