India ODI Schedule 2026: 2026 ఏడాదిలో టీమిండియా వన్డే ఫార్మాట్‌లో బిజీ షెడ్యూల్‌తో అభిమానులను అలరించనుంది. మొత్తం 15 వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత జట్టు.. ఐదు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడుతుంది. హోమ్, హోమ్ అవే సిరీస్‌లతో ఈ ఏడాది క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రో-కోలు ఈ 15 వన్డే మ్యాచ్‌లను సద్వినియోగం చేసుకోనున్నారు. ఇక వీరి ఆటతో అభిమానులు పండగ చేసుకోనున్నారు.
ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2026 జరుగుతోంది. ఐపీఎల్ 2026 అనంతరం ముందుగా భారత్ స్వదేశంలోనే అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అనంతరం ఇంగ్లీష్ గడ్డపై మూడు వన్డేలు ఆడనుంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారన్నది చూడాలి. ఆపై సొంత గడ్డపై వెస్టిండీస్‌పై మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత కివీస్ గడ్డపై భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ పరిస్థితుల్లో విజయం సాధించడం సవాలే అని చెప్పొచ్చు.
Also Read: IND vs ENG T20 WC Stats: భారత్ vs ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్.. టీ20 వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి?
చివరిగా స్వదేశంలోనే శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. మొత్తంగా ఐదు సిరీస్‌లు, 15 మ్యాచ్‌లతో టీమిండియా 2026లో వన్డే ఫార్మాట్‌లో బిజీగా గడపనుంది. ఈ సిరీస్‌లు భవిష్యత్ ఐసీసీ టోర్నీలకు బలమైన జట్టును సిద్ధం చేసుకునే దిశగా కీలకంగా మారనున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐదు సిరీస్‌లలో భారత్ పటిష్ట జట్టును సిద్ధం చేసుకోనుంది. మెగా టోర్నీకి మరో ఏడాది మాత్రమే ఉండటంతో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం దాదాపుగా ఖాయమే.
