NTV Telugu Site icon

Asia Cup 2023: రాహుల్, బుమ్రా అవుట్.. శ్రీలంకతో తలపడే భారత జట్టు ఇదే!

India New

India New

India Playing 11 against Sri Lanka: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాదించిన భారత్.. 24 గంటలు కూడా గడవక ముందే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. అయితే భారత జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

ఇటీవల గాయాల నుంచి కోలుకొని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్.. పాకిస్తాన్‌పై ఆడారు. ఇద్దరు బాగా రాణించారు. రాహుల్ సెంచరీ చేయగా.. బుమ్రా తక్కువ రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే ఈ ఇద్దరికీ శ్రీలంక మ్యాచులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమచాారం. రాహుల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌, బుమ్రా బదులుగా మహమ్మద్ షమీ తుది జట్టులోకి వస్తారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రెండు రోజుల వ్యవధిలో రెండు మ్యాచులు ఆడటంతో ఈ ఇద్దరు అలసిపోయి ఉంటారని మేనేజ్మెంట్ భావిస్తోందట.

Also Read: IND vs SL: నేడు భారత్, శ్రీలంక ఢీ.. మ్యాచ్‌పై కన్నేసిన వరుణుడు! రద్దు మంచిదే

ఆసియా కప్‌ 2023 సూపర్‌-4లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన అన్ని విభాగాల్లో రాణించింది. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే పరిమితం అయింది.

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

Show comments