NTV Telugu Site icon

Himanta Biswa Sharma: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై అసలు కారణం చెప్పిన అసోం సీఎం

Assam Cm

Assam Cm

ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం భారత జట్టు ఓటమి పాలవ్వడంతో భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే, ఈ ఓటమికి రకరకాల కారణాలు చూపుతూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో విశ్లేషణలు కాస్త శ్రుతిమించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీశాయి. ఇక, తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ తరహా కామెంట్స్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు ఇందిరాగాంధీ జన్మదినం కావడంతోనే టీమిండియా ప్రపంచ కప్‌ను కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: Vijayawada: భవాని మండల దీక్ష ధారణ.. ఇంద్రకీలాద్రి పై నేటి నుండి ప్రారంభం

వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్‌లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు. బీసీసీఐకి నా దగ్గర ఒక సలహా.. దయచేసి గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియా మ్యాచ్‌లు పెట్టొద్దని బిశ్వశర్మ సూచించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యనించారు.

Read Also: KIMS Hospital: కిమ్స్‌ ఆస్పత్రిలో మంటలు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ రోగులు

కాగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లడంతో దురదృష్టం వెంటాడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీని ప్రస్తావిస్తూ ‘పనౌటీ’ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.. ఇదిలా ఉండగా గత ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి వెళ్లారు.