India Lost First T20I Match Against New Zealand: జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ప్రత్యర్థి జట్టు కివీస్ కుదిర్చిన 177 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడం వల్లే, భారత్ ఈ పరాభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శనలు కనబరిచి ఆశలు చిగురించినా.. చివరికి అవి నీరుగారిపోయాయి. మిగిలిన బ్యాటర్లు సైతం పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు
తొలుత టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (35), డెవాన్ కాన్వే (52)లతో పాటు మిడిలార్డర్‌లో వచ్చిన డేరిల్ మిచెల్ (59 నాటౌట్) బాగా రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఝలక్‌లు తగిలాయి. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. కష్టాల్లో ఉన్న జట్టుని గట్టెక్కించాడు. తన అద్దిరిపోయే షాట్లతో పరుగుల వర్షం కురిపించి.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే.. అతడు ఔటయ్యాక భారత్ మళ్లీ కష్టాల్లో పడింది.
Prostitution : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు.. బాలీవుడ్ సినీ రచయిత అరెస్ట్
ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ భారత్‌కి మళ్లీ ఊపిరి పోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కివీస్ బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 50 పరుగులు చేశాడు. అతడు క్రీజులో ఉన్నంతవరకు భారత్ గెలవొచ్చన్న ఆశలు చిగురించాయి. కానీ.. అర్థశతకం చేసిన వెంటనే అతడు పెవిలియన్ బాట పట్టాడు. దాంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. వచ్చినవాళ్లు వచ్చినట్టే ఔటయ్యారే తప్ప, ఎవ్వరూ ఖాతా తెరువలేదు. దీంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. నిజానికి.. 177 లక్ష్యం పెద్దదేమీ కాదు. సునాయాసంగానే దాన్ని చేధించొచ్చు. కానీ.. సుందర్, సూర్య మినహా ఎవ్వరూ రాణించకపోయేసరికి భారత్ ఓటమిపాలైంది.