NTV Telugu Site icon

IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం

India Lost 3rd Odi

India Lost 3rd Odi

India Lost 3rd ODI Against Australia: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా కుదిర్చిన 270 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ఆస్ట్రేలియా 21 పరుగులతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇది ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం కావడంతో.. సిరీస్ ఆసీస్ కైవసం అయ్యింది. మొదట్లో ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కాస్త ఆశాజనకమైన ప్రదర్శనని కనబర్చడంతో.. సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, మ్యాచ్‌ని తమవైపుకు తిప్పుకున్నారు.

US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 49 ఓవర్లలో 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. మిచెల్ మార్ష్ ఒక్కడే 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. మిగతా బ్యాటర్లు కొద్దోగొప్పో పరుగులతో బాగానే నెట్టుకొచ్చారు. మరీ పేలవ ప్రదర్శన కనబర్చకుండా.. తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు జోడించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. స్టీవ్ స్మిట్ ఒక్కడే డకౌట్‌గా వెనుదిరగగా.. మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్లే కొట్టారు. చివరికి బౌలర్లు సైతం.. జట్టుకి స్కోరుని జోడించడంలో తమవంతు కృషి చేశారు. అందుకే.. ఏ ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేయగలిగింది. భారత్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగింది.

Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం

ఇక 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. శుభారంభాన్నే అందించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి మొదట్లో పరుగుల వర్షం పారించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక స్కోర్ బోర్డు నత్తనడకగా సాగింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మరో వికెట్ పడనివ్వకుండా.. తమ ఇన్నింగ్స్‌ని నిదానంగా కొనసాగించారు. ఈ క్రమంలో కోహ్లీ (54) అర్థశతకంతో మెరిశాడు. వీళ్లు ఔటయ్యాకే మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. హార్దిక్ పాండ్యా (40) ఒక్కడే జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు. మిగతా వాళ్లెవ్వరూ సరిగ్గా రాణించలేకపోయారు. మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం

భారత్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకున్న అక్షర్ (2), జడేజా (18) సైతం చేతులెత్తేశారు. సరైన సమయంలో ఆసీస్ బౌలర్లు తమ మాయాజాలం చూపించి.. భారత్‌ని కష్టాల్లో పడేసి, మ్యాచ్‌ని తమవైపుకు తిప్పుకున్నారు. చివర్లో వచ్చిన మహమ్మద్ షమీ ఒక సిక్స్, మరో ఫోర్‌తో ఆశలు రేకెత్తించాడు కానీ.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చకచకా వికెట్లు పడ్డాయి. దీంతో.. భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. కీలక సమయంలో ఆడకపోవడంతో, గెలవాల్సిన మ్యాచ్‌ని భారత్ చేజేతులా కోల్పోవాల్సి వచ్చింది.