మొదటి టెస్ట్ లో భారత్ ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్‌గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు దాదాపు సగం ఆట రద్దైంది. దీంతో ఈ టెస్ట్ ఫలితం తేలుతుందా..? లేక వరుణుడి దెబ్బకు డ్రాగా ముగుస్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి.
నాటింగ్‌హామ్ టెస్ట్‌లో మూడో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. అంతకుముందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ , జడేజాలు హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా ధాటిగా ఆడటంతో 278 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్‌సన్ ఐదు, అండర్సన్ నాలుగు వికెట్లతో చెలరేగారు.
Also Read
- BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
39 ఏళ్ల వయసులో జిమ్మీ అండర్సన్ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మన కుంబ్లే గణాంకాలను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో జిమ్మీ నాలుగు వికెట్లు తీయడంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు అండర్సన్. ప్రస్తుతం అండర్సన్ తీసిన వికెట్లు 620. ముత్తయ్య 800 వికెట్లతో మొదటి స్థానంలో… షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..