NTV Telugu Site icon

Hockey: ఆసియా కప్‌లో అద్భుతం చేసిన భారత్

Hockey

Hockey

ఆసియా కప్‌ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్‌లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్‌లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్‌ 15 గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. కానీ ఆతిథ్య ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 16 గోల్స్ చేసి హాకీ ప్రపంచాన్నే భారత్ నివ్వెరపరిచింది.

IPL 2022: రికార్డు బద్దలు కొట్టిన లక్నో-బెంగళూరు మ్యాచ్

ఈ మ్యాచ్‌లో ఒకవేళ భారత్ కనీసం 15 గోల్స్ తేడాతో గెలవకపోయి ఉంటే సూపర్-4 బెర్తు పాకిస్థాన్ వశం అయ్యేది. ఎందుకంటే గత మ్యాచ్‌లో భారత్-పాక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు జపాన్ చేతిలో భారత్ 2-5తో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కంటే మెరుగైన గోల్ రేట్ సాధిస్తేనే భారత్‌కు సెమీస్ ఛాన్స్ ఉందని సమీకరణాలు స్పష్టం చేశాయి. అయితే ఇండోనేషియాతో మ్యాచ్‌లో భారత్ అదరగొట్టి అభిమానుల మనసులను కూడా గెలుచుకుంది. కాగా ఇప్పటికే సూపర్-4 దశకు జపాన్, మలేషియా, దక్షిణ కొరియా జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే.