ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే.
అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి రాకపోవడంతో ఇప్పుడు ఈ సిరీస్ పై క్లారిటీ రాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆగష్టు 17 నుండి ఈ సిరీస్ స్టార్ట్ అవాలి. కానీ ఇండియా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో సిరీస్ పై అనిచ్చితి నెలకొంది.
Also Read:Vishwambhara: విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు!
ఇక దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. మేము బీసీసీఐతో ఈ సిరీస్ గురించి చర్చిస్తున్నాం. పాజిటివ్ గా సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను. ఇండియా గవర్నమెంట్ నుండి ఇంకా క్లియరెన్స్ రాకపోవటంతోనే ఈ సిరీస్ ని ఫైనల్ చేయలేదు. కానీ తొందర్లోనే దీనిపై నిర్ణయం వస్తుందని ఎదురు చూస్తున్నాం అని చెప్పారు.
Also Read:RCB: “ఆర్సీబీ” న్యూసెన్స్ చేసింది.. పోలీసులు దేవుళ్లు కాదు..
ఇక ఈ సిరీస్ లేకపోతే టీమిండియా అభిమానులకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్ మరియు టీ20లకు రిటర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం వీరిద్దరూ ఒన్డేలలో మాత్రమే ఆడుతున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ లేకపోతే వీళ్ళిద్దరిని క్రికెట్ మైదానంలో చూడాలన్న అభిమానులు మరికొంతకాలం ఆగాల్సిందే.
