INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Slow Batting: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టుకు పాకిస్థాన్ ‘ఏ’ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పాక్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. భారత కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా.. జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో తిలక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించడంపై మాజీ భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఫైర్ అయ్యాడు. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలకే కారణం అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
25 బంతుల్లో కేవలం 3 పరుగులే:
‘తిలక్ వర్మ తొలి 25 బంతుల్లో కేవలం 3 పరుగులే చేశాడు. ఆ తర్వాతి 25 బంతుల్లోనూ 12-13 పరుగులు మాత్రమే సాధించాడు. 50 బంతులు ఆడిన తర్వాత కూడా 18-21 పరుగులే చేస్తే.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలి. తిలక్ చివర్లో వేగం పెంచి పరుగులు సాధించగలననే నమ్మకంతో కనిపించాడు. కానీ అతని నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఒత్తిడి పెరిగినప్పుడు వికెట్లు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి’ అని సంజయ్ బంగర్ వివరించాడు.
Also Read
- Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు 'తలా'లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
- Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
- Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Shubman Gill Dance: నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? డీఆర్ఎస్ సక్సెస్‌తో మైదానంలోనే డ్యాన్స్.. వైరల్ వీడియో!
స్ట్రైక్ రొటేషన్ చేయాల్సింది:
‘ఈ మ్యాచ్‌లో భారత్ మరో విషయంలోనూ తప్పు చేసింది. పాకిస్థాన్ స్పిన్నర్ హసన్ నవాజ్‌తో పూర్తి 10 ఓవర్లు బౌలింగ్ చేయించుకునే అవకాశం కల్పించడమే టీమిండియా చేసిన పొరపాటు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఎడమ, కుడి చేతి బ్యాటర్ల జోడీని ఉపయోగించి.. స్ట్రైక్ రొటేషన్ చేయాల్సింది. అలా చేసి ఉంటే పాకిస్థాన్ నవాజ్‌తో మొత్తం 10 ఓవర్లు వేయించే అవకాశం ఉండేది కాదు’ అని సంజయ్ బంగర్ విశ్లేషించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. వైభవ్ సూర్యవంశీ 11 పరుగులు చేయగా.. ఆయుష్ బదోని డకౌట్ అయ్యాడు. కుమార్ కుశాగ్ర 2, రింకూ సింగ్ 6, సూర్యాన్ష్ షెడ్గే 6 పరుగులకే వెనుదిరిగారు. దీంతో భారత్ 25 ఓవర్ల సమయానికి 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులతో కష్టాల్లో పడింది.
147 బంతుల్లో సెంచరీ:
ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మకు షాబాజ్ అహ్మద్ అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ 241/7 స్కోరుకు చేరుకుంది. అయితే 43వ ఓవర్లో షాబాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ పాకిస్థాన్ వైపు మళ్లింది. ఆ తర్వాత విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా డకౌట్ కావడంతో భారత్ విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిలక్ 147 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు పడగొట్టగా, హసన్ నవాజ్ మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ ఇమ్రాన్ రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు. నేపాల్‌పై విజయం సాధించి టోర్నీని ప్రారంభించిన టీమిండియా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
తాజావార్తలు
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
ట్రెండింగ్
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..