NTV Telugu Site icon

IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Rohit Kohli Test

Rohit Kohli Test

India to play 2 practice matches before IND vs WI Test Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. అజింక్య రహానే తిరిగి వైస్‌ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. మరో సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై వేటు వేశారు. ఉమేశ్‌ స్థానంలో నవ్‌దీప్‌ సైనిని ఎంపిక చేశారు. ముగ్గురు కొత్త ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కింది.

ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన యువ ప్లేయర్స్ రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైశ్వాల్‌ సహా.. వికెట్స్ తీసిన 30 ఏళ్ల ముకేశ్‌ కుమార్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురూ డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023కు స్టాండ్‌బైలుగా ఉన్న విషయం తెలిసిందే. దేశవాళీ మ్యాచులలో సహా ఐపీఎల్‌లోనూ రాణించిన రుతురాజ్‌, ముకేశ్‌ విండీస్‌తో వన్డే సిరీస్‌కూ అవకాశం దక్కించుకున్నారు. వరుసగా విఫలమవుతున్న తెలుగు ప్లేయర్ కేఎస్‌ భరత్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Also Read: Cheteshwar Pujara Retirement: ‘నయా వాల్’ చెతేశ్వర్‌ పుజారా కెరీర్ ముగిసినట్లేనా?

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 ఓటమి నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను బీసీసీఐ చాలా సీరియస్‌గా తీసుకుంది. జూలై 12న డొమినికా వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో పూర్తిస్థాయిలో భారత జట్టును ఆడించాలని భావిస్తోంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా బార్బడోస్‌ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ తుది జట్టులో ఉండే అందరూ ఈ రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో ఆడుతారని సమాచారం.

ఈ టెస్టు సిరీస్‌ కోసం భారత్ జట్టు వేర్వేరు బ్యాచ్‌లగా విండీస్ చేరుకోనుంది. జూలై 2న బ్రిడ్జ్‌టౌన్‌లో భారత ఆటగాళ్లు సమావేశం కానున్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఇంకా లండన్‌లోనే ఉన్నారు. వీరు నేరుగా లండన్‌ నుంచి కరీబియన్‌ చేరుకోనున్నారు. విండీస్‌ పర్యటనలో భారత్‌ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. టీ20లకు జట్టును త్వరలోనే ప్రకటిస్తారు. రోహిత్‌, కోహ్లీ దూరంగా ఉండనున్న ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ చేయనున్నాడు.

Also Read: Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్స్‌ ఖర్జూరాలు తినొచ్చా.. షుగర్ లెవెల్స్ పెరుగుతాయా?!

Show comments