Site icon NTV Telugu

IND vs WI Qualification Scenarios: భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు.. అదే జరిగితే టీమిండియా ఇంటికే!

IND vs WI Super 8 Qualification Scenarios

IND vs WI Super 8 Qualification Scenarios

India vs West Indies Super 8 Qualification Scenario for Semi Finals in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో సెమీ ఫైనల్‌ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. గ్రూప్1లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా.. జింబాబ్వే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్, వెస్టిండీస్ జట్ల సెమీస్ రేస్ రసవత్తరంగా ఉంది. మార్చి 1న జరిగే మ్యాచ్‌ ఇరు జట్ల భవితవ్యంను నిర్ణయించనుంది. ఈ పోరు కోల్‌కతా వేదికగా జరగనుండగా.. ప్రస్తుత సమీకరణాల ప్రకారం వెస్టిండీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

గురువారం (ఫిబ్రవరి 26) సాయంత్రం వరకు భారత్ సెమీస్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఒక్కరోజే టీమిండియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించడం, జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో భారత్ ఒక్కసారిగా సెమీస్ రేసులో నిలిచింది. ఇక సెమీస్‌కు చేరాలంటే తప్పనిసరిగా మార్చి 1న వెస్టిండీస్‌పై గెలవాల్సిందే. విజయం సాధిస్తే సూర్య సేన నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రేండేసి పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్ రన్ రేట్‌లో కరేబియన్లు (+1.791) ముందంజలో ఉన్నారు. భారత్ రన్ రేట్‌ -0.100గా ఉంది.

Also Read: Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు వెస్టిండీస్‌ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది. సూర్య సేనకు గెలుపు తప్ప మరో మార్గం లేదు. వెస్టిండీస్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కరేబియన్లకు కూడా విజయం అవసరమే కానీ.. మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా సెమీస్ చేరుతారు. అంటే విండీస్‌కు రెండు మార్గాలు ఉండగా.. భారత్‌కు మాత్రం ఒకటే మార్గం గెలుపు. ఈ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. ఎవరు గెలిస్తే వారు ముందుకు వెళుతారు. దీంతో భారత్ అభిమానులు ఈ పోరును మినీ ఫైనల్‌ మ్యాచ్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం పడొద్దని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version