భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం (నవంబర్ 14) నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్ నుంచి విడుదల చేసింది. నితీష్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు అతడు దక్షిణాఫ్రికా-ఎతో వన్డేలు ఆడనున్న భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దేశవాళీల్లో సత్తా చాటుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆడడం దాదాపుగా ఖాయం అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో జురెల్ ఆడాడు జురెల్. పంత్ గాయం నుంచి కోలుకుని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికవ్వడంతో జురెల్‌కు ప్లేయింగ్ 11లో స్థానం కష్టమే అనిపించింది. కానీ తాజాగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో (127 నాటౌట్, 132 నాటౌట్, 44, 125, 56, 140) అదరగొట్టాడు. దాంతో తుది జట్టులో కూడా ప్లేస్ ఖాయంగామారింది. దాంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
అక్షర్ పటేల్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరం కావచ్చు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పసర్లతో ఆడనుంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగంలో ఆడనున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడుతారు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జడేజా, సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు.
Also Read: PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
భారత్ తుది జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
