Site icon NTV Telugu

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. భారత్‌ తుది జట్టు ఇదే! గిల్, సూరీడు తప్ప..

Ind Vs Sa 2nd T20

Ind Vs Sa 2nd T20

India vs South Africa 2nd T20 Playing XI: భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ముల్లాన్‌పుర్‌ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20 ఆడనుంది. మంగళవారం కటక్‌లో జరిగిన తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కొనసాగించాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినప్పటికీ దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేము. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సఫారీలు రెండో టీ20 చెలరేగగాలని చూస్తున్నారు. సూర్య సేన ఆధిక్యం 2-0కు పెరుగుతుందా.. లేదా దక్షిణాఫ్రికా 1-1తో సిరీస్ సమయం చేస్తుందా చూడాలి.

తొలి టీ20లో భారత్ గెలిచినా బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. హార్దిక్‌ పాండ్యా చెలరేగకపోయుంటే ఫలితం మరోలా ఉండేది. వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. టీ20 ఓపెనర్‌ అవతారం ఎత్తినప్పటి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. సంజు శాంసన్‌ను తప్పించి మరీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా.. వన్డే, టెస్ట్ మాదిరి సక్సెస్ అవ్వడం లేదు. టీ20 ప్రపంచకప్ 2026 ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో అయినా గిల్ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరోవైపు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ ఫామ్‌ కూడా జట్టును ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కాలంగా నిలకడగా ఆడలేకపోతున్న సూరీడు కూడా పరుగులు చేయాల్సి ఉంది.

అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మలు భారీగా పరుగులు చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. హార్దిక్‌ పాండ్యా పునరాగమనంలో చెలరేగడం శుభపరిణామం. శివమ్ దూబే, అక్షర్‌ పటేల్, జితేశ్‌ శర్మలు పరుగులు చేస్తే భారీ స్కోరు ఖాయం. ఇక బౌలర్లు రాణిస్తుండడం మంచి విషయం. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగుతున్నారు. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ వికెట్స్ తీస్తున్నారు. ఆల్‌రౌండర్‌లు దూబే, హార్దిక్‌ కూడా సత్తా చాటితే తిరుగుండదు. రెండో టీ20కి తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు లేవు. ఇక ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో చెలరేగాలని చూస్తోంది. సఫారీలు కూడా

ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ కొత్త స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. నేడు మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఈ మైదానంలో 11 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 6 సార్లు గెలిచింది. 200 ప్లస్ టార్గెట్ ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. పిచ్ ఫాస్ట్‌ బౌలర్లకు సహకరించనుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్), తిలక్‌ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబె, జితేశ్‌ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్‌ ఫెరీరా, మార్కో జాన్సెస్, సిపమ్లా, కేశవ్‌ మహరాజ్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్.

 

Exit mobile version