Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Nz Odi Series Indias Probable Squad Revealed Shubman Gill Likely Captain

IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే!

Published Date :January 3, 2026 , 3:38 pm
By Sampath Kumar
  • వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై ఆసక్తికర చర్చ
  • యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు
  • పంత్ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు ప్లస్‌
IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్, యువకులతో టీమ్ సమతుల్యంగా ఉండేలా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌కు అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారమే జట్టును ఎంపిక చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈరోజటికి వాయిదా పడింది. కెప్టెన్సీ బాధ్యతలు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించే అవకాశం ఉండటం ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు కీలకంగా ఉండనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు ఎంపిక కానున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పంత్ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ప్లస్‌గా మారనుంది. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. బ్యాట్‌తో పాటు బంతితోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం వీరి సొంతం.

Also Read

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
  • India-Pakistan: "పాకిస్తాన్‌తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
Add as a preferred
source on google

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. అతని చైనామన్ స్పిన్ కీలకంగా మారే అవకాశం ఉంది. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ జట్టు ముందుకు నడిపించనున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి పేసర్లు జట్టులో చోటు దక్కించుకోనున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2026ని దృష్టిలో ఉంచుకుని పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించనున్నట్లు తెలిసింది. కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు ఎలా ప్రదర్శిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: Balakrishna-Boyapati: ‘అఖండ’ కాంబో.. బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్?

భారత జట్టు (అంచనా):
1. శుభమాన్ గిల్ (కెప్టెన్)
2. రోహిత్ శర్మ
3. విరాట్ కోహ్లీ
4. రుతురాజ్ గైక్వాడ్
5. కేఎల్ రాహుల్
6. రిషబ్ పంత్
7. తిలక్ వర్మ
8. ప్రసిద్ధ్ కృష్ణ
9. అక్షర్ పటేల్
10. యశస్వి జైస్వాల్
11. వాషింగ్టన్ సుందర్
12. కుల్దీప్ యాదవ్
13. మహ్మద్ సిరాజ్
14. హర్షిత్ రాణా
15. అర్ష్‌దీప్ సింగ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs nz
  • Ind vs NZ odi series
  • India probable squad vs NZ
  • India vs New Zealand ODIs
  • Shubman Gill

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions