IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Ishan Kishan Dropped Catches: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓవెల్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో కివీస్ బ్యాటర్ విల్ యంగ్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు యంగ్ భారీ స్కోరు అందించాడు. అయితే అతడు చేసిన సెంచరీ వెనుక టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలు కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇచ్చిన రెండు క్యాచ్ అవకాశాలను యంగ్ సద్వినియోగం చేసుకుని సెంచరీ బాదాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే విల్ యంగ్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. అతడు ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు భారత బౌలర్ ఔకిబ్ నబీ వేసిన రెండో ఓవర్ ఐదవ బంతికి లైఫ్ దక్కింది. స్లిప్‌లో రోహిత్ శర్మ సులభమైన క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాతి బంతికే మరోసారి యంగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యంగ్ బ్యాట్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వైపు వెళ్లింది. ఇషాన్ కూడా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. దీంతో యంగ్‌కు వరుసగా రెండు అవకాశాలు లభించాయి. ఈ రెండు తప్పిదాలు న్యూజిలాండ్ బ్యాటర్‌కు కలిసొచ్చాయి.
Also Read
- IPL 2027-KKR: కొత్త కెప్టెన్‌గా విండీస్ స్టార్.. కేకేఆర్‌కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
- Pat Cummins: "నాకు అస్సలు తెలియదు".. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
ఐదు పరుగుల వద్దే పెవిలియన్‌కు చేరాల్సిన విల్ యంగ్.. లైఫ్‌లు ఉపయోగించుకుని భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌండరీలతో పరుగుల వేగాన్ని పెంచాడు. 88 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌పై అతడికిదే తొలి వన్డే సెంచరీ కాగా.. అంతర్జాతీయ వన్డే కెరీర్లో ఐదో శతకం. సెంచరీ తర్వాత కూడా యంగ్ దూకుడు కొనసాగించాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. చివరకు 37వ ఓవర్లో నమన్ ధీర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కుమార్ కుశాగ్రకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఒకవేళ ఆరంభంలో రోహిత్‌శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరు క్యాచ్ పట్టి ఉంటే విల్ యంగ్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల వద్దే ముగిసేది. కానీ రెండు అవకాశాలు చేజారడంతో అతడు ఏకంగా 125 పరుగులు సాధించాడు. కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడం టీమిండియాకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఈ ఇన్నింగ్స్ మరోసారి చూపించింది. ప్రస్తుతం 40 ఓవర్లకు కివీస్ స్కోర్ 265/6. క్రీజ్‌లో శాంట్నర్ (7), క్లార్కె (1) ఉన్నారు. ఇంకా 10 ఓవర్లు ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
-
CM Revanth Reddy: వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
Personal Loan Interest Rates: ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ? ఆ బ్యాంకుల మధ్య పోలిక ఇదే..!
-
OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!