IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. బే ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి పూర్తిగా తేలిపోయింది. కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాట్ హెన్రీ ఆరు వికెట్లతో భారత బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు.
334 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు తొలి ఓవర్లోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముగ్గురినీ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించాడు. ఒకే ఓవర్లో ముగ్గురు కీలక బ్యాటర్లు డకౌట్ కావడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఐదు పరుగులు చేసిన అతడిని కైల్ జేమీసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.
Also Read
- Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
- Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
- IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
- NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
అనంతరం బౌలర్ మాథ్యూ ఫిషర్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అక్షర్ పటేల్ (21), నమన్ ధీర్ (21), అకిబ్ నబీ (5)లను పెవిలియన్‌కు పంపించాడు. మరోవైపు మాట్ హెన్రీ తిరిగి విజృంభించడంతో భారత ఇన్నింగ్స్ 89 పరుగులకే ముగిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 27 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ ఫిషర్ 31 పరుగులకు మూడు వికెట్లు, కైల్ జేమీసన్ 12 పరుగులకు ఒక వికెట్ తీశాడు. ఈ ముగ్గురి ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.
ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇప్పటికే ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఆదివారం మౌంట్ మాంగనుయ్ వేదికగా జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..