IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Opener in IND vs NZ 3rd T20: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో టీ20కి కూడా దూరమయ్యాడు. తొలి టీ20లో కుడి తొడ కండరానికి గాయం కాగా.. అతడు ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో జరగనున్న మూడో టీ20కి ఇషాన్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించినప్పటికీ.. అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినా కూడామూడో మ్యాచ్‌లో వైభవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, అయితే ఇంకా మ్యాచ్ ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ సాధించలేదని బీసీసీఐ వెల్లడించింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా అతడికి కుడి తొడ కండరానికి స్వల్ప స్థాయి గాయం అయింది. అప్పటి నుంచి వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో మూడో టీ20కి కూడా ఇషాన్ అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కుమార్ కుశాగ్ర మూడో టీ20కి కూడా జట్టుతో కొనసాగనున్నాడు. ఇషాన్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.
Also Read
- Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
- Arshdeep Singh: వైట్ బాల్ స్టార్ టు రెడ్ బాల్ స్పెషలిస్ట్.? టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధం..! బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
- Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
- Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
ఇషాన్ కిషన్ స్థానంలో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. బుడ్డోడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా మాత్రమే ఆడిన అనుభవం ఉన్న వైభవ్.. మూడో స్థానంలో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. రెండో టీ20లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతడిని మూడో స్థానంలో ఆడించడం సరైన నిర్ణయమా? అనే చర్చ మొదలైంది. వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఒకవేళ ఓపెనర్‌గా బుడ్డోడు ఆడితే.. సంజు శాంసన్ మూడో స్థానంలో ఆడుతాడు. చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.
తాజావార్తలు
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!