IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది. ఇక, భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందరి 4 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక, రెండు ఇన్నింగ్స్ ల్లో వాషింగ్టన్ సుందర్ 11 వికెట్లు తీశాడు.
Read Also: MS Dhoni: సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్‌న్యూస్.. పుకార్లకు చెక్ పెట్టిన ఎంఎస్ ధోనీ
ఇక, 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 57 పరుగులు జోడించిన తర్వాత మిగతా ఐదుగురు బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఔట్ చేశారు. అయితే, కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) పర్వాలేదనిపించారు. అయితే, అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలిపోయింది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ తీసుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ చెరో 30 పరుగులు చేశారు.