IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటు.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!
- తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఢీ
- సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొత్త సవాల్
- భారత్ కోసం ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్‌లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు వికెట్లు కోల్పోవడం సూర్య సేనను ఆందోళన కలిగిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో ఆడిన మ్యాచ్‌లో భారత్ 8 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. నమీబియాపై 8 ఓవర్లలో 61 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది. పాకిస్థాన్‌పై 18 ఓవర్లలో 144 పరుగులకు 7 వికెట్లు పడగా.. నెదర్లాండ్స్‌పై జట్టుపై 8 ఓవర్లలో 70 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై 4 ఓవర్లలో 29 పరుగులకు 4 వికెట్లు, వెస్టిండీస్‌పై 6 ఓవర్లలో 58 పరుగులకు 1 వికెట్, జింబాబ్వేపై 6 ఓవర్లలో 55 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై మినహా మిగతా మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు స్పిన్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఈ గణాంకాలు భారత బ్యాటర్ల స్పిన్ బలహీనతను చూపిస్తున్నాయి.
Also Read
ముంబైలో సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లాండ్‌ను భారత్ ఎదుర్కోవాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు స్పిన్ దళంతో బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, జాకబ్ బెథెల్ వంటి ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటును ఇంగ్లీష్ టీమ్ యూఏపీయోగించుకోనుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. భారత్‌కు కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో మధ్య ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం, స్ట్రైక్ రోటేట్ చేయడం ఇప్పుడు సూర్య సేనకు అత్యంత ముఖ్యం. భారత్ బ్యాటర్లు స్పిన్నర్లపై దూకుడుగా ఆడతారా? లేక జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తారా? అన్నది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. సెమీఫైనల్లో భారత్‌కు స్పిన్ బౌలింగ్ పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ స్పిన్ పరీక్షను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!